హైదరాబాద్, డిసెంబర్ 11: టెలికం దిగ్గజం రిలయన్స్ జియో..నూతన సంవత్సరం 2025 సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వచ్చే నెల 11 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ప్రత్యేక రీచార్జ్ ప్లాన్‌తో వినియోగదారులు భారీగా ప్రయోజనాలు పొందవచ్చునని తెలిపింది. రూ.2,025 పేరుతో ప్రకటించిన ఈ ప్లాన్ 200 రోజుల పాటు అన్లిమిటెడ్ 5జీ సేవలు, రోజుకు 2.5 జీబీ డాటా చొప్పున 500 జీబీ డాటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్-ఎస్ఎంఎస్లు, దీంతోపాటు రూ.2,150 పార్టనర్ కూపన్ల రూపంలో ప్రయోజనాలు పొందవచ్చునని తెలిపింది. వీటిలో ఆజియోలో రూ.2,500 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలుపై రూ.500 కూపన్తోపాటు రూ.499 స్విగ్గీ ఆర్డర్‌పై రూ.150 తగ్గింపు, ఈజ్ మై ట్రిప్పై రూ.1,500 తగ్గింపును పొందవచ్చునని తెలిపింది.