బాహుబలి ఐపీవోలు
- రూ.50,000-75,000 కోట్ల శ్రేణిలో
- రిలయన్స్ రిటైల్, జియో పబ్లిక్ ఇష్యూలు?
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా రెండు మెగా పబ్లిక్ ఇష్యూలకు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ యోచిస్తున్నారు. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్), రిలయన్స్ జియో ప్లాట్‌ఫాం (ఆర్‌జేపీఎల్) ఐపీవోలను రూ.50,000-75,000 కోట్ల శ్రేణిలో భారీగా తీసుకురావాలని చూస్తున్నారు.
ఇరు సంస్థల్లో కనీసం 10 శాతం మేర వాటాలను అమ్మకానికి పెట్టనున్నట్టు తెలుస్తున్నది. ఈ ఏడాది జరగబోయే సంస్థ వార్షిక సాధారణ సమావేశంలో ఈ బాహుబలి ఐపీవోల గురించి అంబానీలు ప్రకటన చేసే వీలుందని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. రిలయన్స్ రిటైల్ విలువను దాదాపు రూ.8 లక్షల కోట్లుగా, జియోను సుమారు రూ.7.5 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు.
విదేశీ స్టాక్ మార్కెట్లలోనూ..
రిలయన్స్ రిటైల్, జియో షేర్లను భారతీయ స్టాక్ మార్కెట్లతోపాటు విదేశీ స్టాక్ మార్కెట్లలోనూ నమోదు చేసే ఆలోచనలో ముకేశ్ అంబానీ ఉన్నారు. ముఖ్యంగా రిలయన్స్ జియో షేర్లను అమెరికాలోని నాస్డాక్లో లిస్టింగ్ చేసే వీలున్నది. టెక్నాలజీ సంస్థలకు నాస్డాక్.. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న విషయం తెలిసిందే. కాగా, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభ పరిస్థితులు తగ్గుముఖం పడితే మార్కెట్ రెగ్యులేటర్లకు ప్రాస్పెక్టస్‌ను సమర్పించే అవకాశాలున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా ఐపీవోలను పట్టాలెక్కించవచ్చని చెప్తున్నారు. రిలయన్స్ రిటైల్‌కు దేశవ్యాప్తంగా దాదాపు 14,500 స్టోర్లున్నాయి. అలాగే జియోకు 420 మిలియన్ల కస్టమర్లున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

