తిరుమల : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నేరుగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. నిన్న స్వామివారిని 63,837 మంది భక్తులు దర్శించుకోగా 20,904 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 2.85 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
డిసెంబర్ 29, 30 , 31 వైకుంఠ ద్వార దర్శనం తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (Special Entrance Darsan,) శ్రీవాణి బ్రేక్ దర్శనాలకు సంబంధించిన టిక్కెట్లు పరిపాలనా కారణాల వలన విడుదల చేయడం లేదని టీటీడీ అధికారులు వెల్లడించారు. టిక్కెట్ల విడుదలకు సంబంధించిన సవరించిన షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తుందని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.