Transgenders | అమరావతి : ట్రాన్స్జెండర్లు వీరంగం సృష్టించారు. ఓ మహిళా నర్సుపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కందుకూరులో వెలుగు చూసింది.
కోవూరు రోడ్డులోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలోకి ఓ ఆరుగురు ట్రాన్స్జెండర్లు చొరబడ్డారు. ఇక అక్కడున్న ఓ నర్సు వద్దకు వెళ్లి దసరా మామూలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వలేదని నర్సుపై ట్రాన్స్జెండర్లు దాడికి పాల్పడ్డారు. ఇష్టమొచ్చినట్లు బూతులు తిడుతూ, జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి, బట్టలు చించేసి నర్సుపై దాడి చేశారు. దాడికి పాల్పడ్డ హిజ్రాలందరూ మద్యం మత్తులో ఉన్నట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.
ఈ ఘటనపై ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నర్సుపై హిజ్రాల దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హిజ్రాల ఆగడాలు ఎక్కువైపోతున్నాయని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
దసరా మామూలు ఇవ్వలేదని నర్సును జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి దారుణంగా కొట్టిన హిజ్రాలు
నెల్లూరు జిల్లా కందుకూరులో హిజ్రాల దౌర్జన్యం
మద్యం మత్తులో కోవూరు రోడ్డులోని ఓ ఆసుపత్రికి వెళ్లి, డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వలేదని నర్సుపై దాడి
ఇష్టమొచ్చినట్లు బూతులు తిడుతూ, జుట్టు పట్టుకొని… pic.twitter.com/x1pMtD1UlI
— Telugu Scribe (@TeluguScribe) September 24, 2025