Pawan Kalyan | అమరావతి : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడ్డట్టు సమాచారం. గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నిన్న జ్వరంతోనే అసెంబ్లీ సమావేశాలతో పాటు ఇతర సమీక్షా సమావేశాలకు హాజరైనట్లు సమాచారం. ఈ క్రమంలో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.
ఇక పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజిత్ సైన్ దర్శకత్వం వహిస్తుండగా.. డీవీవీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హుషారుగా ఉన్నారు. అన్ని థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ భారీ కటౌట్లు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరుస ప్రమోషన్స్ చేస్తుంది చిత్రయూనిట్. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి సాలిడ్ అప్డేట్ను పంచుకుంది చిత్రయూనిట్. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఒపెన్ అయినట్లు చిత్రబృందం ప్రకటించింది.