న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి కీలక నిర్ణయం తీసుకున్నది. అమెరికా క్రికెట్(USA Cricket) సభ్యత్వాన్ని సస్పెన్షన్‌లో పెట్టింది. తక్షణమే తన నిర్ణయాన్ని అమలులోకి తెచ్చింది. గత ఏడాది కాలం నుంచి స్టేక్‌హోల్డర్స్‌తో నిర్వహించిన సమీక్ష ఆధారంగా ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నది. ఐసీసీ సభ్య దేశంగా యూఎస్ఏ క్రికెట్ వరుసగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ఐసీసీ తన స్టేట్మెంట్లో పేర్కొన్నది. 2028లో లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు ప్రవేశం కల్పించాలన్న ఉద్దేశంతో ఐసీసీ ఉన్నది. కానీ ఐసీసీ నియమావళిని అమెరికా క్రికెట్ సంఘం పదేపదే ఉల్లంఘిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూఎన్ఏ క్రికెట్‌పై సస్పెన్షన్ విధిస్తున్నట్లు ఐసీసీ చెప్పింది. బోర్డు సభ్యుల మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. క్రికెట్ ఆట దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తప్పలేదని ఐసీసీ పేర్కొన్నది. అయితే ఐసీసీ ఈవెంట్లలో అమెరికా జాతీయ జట్లు పాల్గొనే హక్కు ఉన్నట్లు ఐసీసీ బోర్డు చెప్పింది.