హైదరాబాద్, ఫిబ్రవరి 9: జీఎమ్మార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రమంగా నష్టాలను తగ్గించుకుంటున్నది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.515.34 కోట్ల కన్సాలిడేటెడ్ నికర నష్టం వచ్చినట్లు వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,120.51 కోట్ల నష్టంతో పోలిస్తే భారీగా తగ్గింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.963 కోట్ల నుంచి రూ.1,437.84 కోట్లకు ఎగబాకింది. కరోనా వైరస్‌తో గ్రూపు వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపిందని, ఇది స్వల్పకాలం మాత్రమేనని, దీర్ఘకాలికంగా ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు లేవని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.