లండన్: కొత్త ప్లాస్టిక్ బాటిళ్ల కంటే రీసైకిల్ చేసిన బాటిళ్ల నుంచే ప్రమాకరమైన రసాయనాలు ఎక్కువగా విడుదల అవుతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్లాస్టిక్ బాటిళ్ల నుంచి 150కి పైగా రసాయనాలు అందులోని పానీయాల్లోకి వెళ్తున్నాయని లండన్‌లోని బ్రూనెల్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ఇందులో 18 రసాయనాలు మోతాదుకు మించిన స్థాయిలో ఉన్నాయని వెల్లడించారు. కొత్త పాలిథిలిన్ టెరాప్తలెట్(పీఈటీ) బాటిళ్లలోని డ్రింక్‌ల కంటే రీసైకిల్డ్ పీఈటీ బాటిళ్లలోని పానీయాల్లో ఎక్కువగా రసాయనాల సాంద్రత ఉన్నట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు.