ముంబై: కరోనా వైరస్ బారిన పడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్, వికెట్ కీపర్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్ కోలుకున్నారు. గత వారం మొదట మార్ష్‌కు కరోనా పాజిటివ్ రాగా ముందు జాగ్రత్తగా దవాఖానలో చేరాడు. రెండు రోజులకు సీఫర్ట్‌కు కరోనా సోకగా ఐసొలేషన్‌లోకి వెళ్లాడు. ప్రస్తుతం కోలుకోవడంతో వీరిద్దరూ బుధవారం జరిగిన ప్రాక్టీస్‌లో ప్రత్యక్షమయ్యారు. ‘మార్ష్, సీఫెర్ట్ తిరిగి ప్రాక్టీస్‌కు రావడం సంతోషంగా ఉంది’ అని ఢిల్లీ యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా మార్ష్, సీఫర్ట్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను ఢిల్లీ తమసోషల్ మీడియాలో పంచుకుంది. గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఢిల్లీ తలపడనుంది.