పాలమూరులో భూముల విలువ విపరీతంగా పెరిగింది. ‘రియల్’ వ్యాపారం జోరుగా సాగుతుండడంతో అదే స్థాయిలో
డిమాండ్ వచ్చింది. ఒకప్పుడు గేటెడ్ కమ్యూనిటీగా పేరున్న సారిక టౌన్షిప్ (రాజీవ్ స్వగృహ)లో ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలానికి అనూహ్య స్పందన లభించింది. 240 ప్లాట్లకూ ఒక్కటి కూడా మిగలకుండా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. వేలం గజం రూ.8 వేల నుంచి మొదలు కాగా రూ.26 వేలకుపైగా కొనసాగింది. దీన్ని బట్టి జిల్లా కేంద్రంలో ప్లాట్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల పరిధిలో రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లను వేలం వేయగా.. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల తర్వాత అత్యధిక ధర మహబూబ్‌నగర్‌లోనే పలికింది. గద్వాల ప్లాట్లను సైతం దక్కించుకునేందుకు బిడ్డర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్, మార్చి 18 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓపెన్ ప్లాట్లకు హైదరాబాద్ తరహాలో డిమాండ్ ఉన్నది. ఒకప్పుడు మహబూబ్‌నగర్‌లో ఏ మాత్రం డిమాండ్ లేని గేటెడ్ కమ్యూనిటీగా పేరున్న సారిక టౌన్ షిప్ (రాజీవ్ స్వగృహ)లో నిర్వహించిన ఓపె న్ ప్లాట్ల బహిరంగ వేలంలో అనూహ్యంగా ధర పలికింది. 240 ప్లాట్లకు ప్రభుత్వం వేలం నిర్వహించ గా.. ఒక్క ప్లాటు కూడా మిగలలేదు. నిమిషాల వ్య వధిలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. తక్కువ ధరలో ప్లాట్లు కొందామని వచ్చిన వారు మా వల్ల కాదంటూ వెళ్లిపోయారు. ఎలాగైనా ప్లాట్ దక్కించుకుందామని వచ్చిన బిడ్డర్లు మాత్రం రూ.8వేలు గజం ధర ఉన్న ప్లాట్లను రూ.26వేలకు పైగా వె చ్చించి సొంతం చేసుకున్నారు. ప్రభుత్వం వేసిన లే అవుట్లకు ఎంతటి స్పందన ఉంటుందో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెం దుతున్న మహబూబ్‌నగర్ బ్రాండ్ విలువేంటో మ రోసారి వెల్లడైంది. ఇక గద్వాలలోనూ వేలానికి అనూహ్య స్పందన వచ్చింది.
తెలంగాణ ఏర్పాటుకు ముందు పాలమూరులో గజం రూ.3వేలకు కూడా ఎవరూ కొనే పరిస్థితి లే దు. తాగునీటి వసతి కూడా లేని చోట సొంత ఇల్లు కట్టుకునేందుకు పెద్దగా మోజు చూపేవారు కాదు. ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. 2014 లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కో సమస్య పరిష్కారమవుతూ వచ్చింది. మిషన్ భగీరథతో తాగునీటి సమస్యకు పూర్తిగా చెక్ చెప్పారు. 2016లో జి ల్లాల విభజన తర్వాత మహబూబ్‌నగర్ మూడు ని యోజకవర్గాల పరిధికే జిల్లా కేంద్రంగా మారిపోయింది. ఫలితంగా బ్రాండ్ మహబూబ్‌నగర్ డి మాండ్ మరోసారి పడిపోతుందని అందరూ అంచ నా వేశారు. పట్టణం విలువ తగ్గలేదు సరికదా.. మ రింత ఊపందుకున్నది. క్రమంగా పట్టణంలో నిర్మాణాలు పెరిగాయి. విశాలమైన రోడ్లు, అందమైన పా ర్కులు అందుబాటులోకి వచ్చాయి. మొత్తంగా తె లంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా భూముల ధరలు అనూహ్యంగా పెరిగాయని చెప్పొచ్చు.
జడ్చర్ల సమీపంలోని పోలెపల్లి సెజ్‌లో అనేక పరిశ్రమలు రావడంతో వేలాది మంది వివిధ రాష్ర్టాల నుంచి ఉద్యోగాల కోసం వచ్చారు. వీరంతా జడ్చర్ల లేదా మహబూబ్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. అలాగే మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుతో వైద్య రంగం ఊపందుకున్నది. ప ట్టణంలో ఎటు చూసినా పెద్ద పెద్ద ప్రైవేటు దవాఖానలు వెలిశాయి. జనసందడి పెరగడంతో వ్యాపారా లు మెరుగయ్యాయి. మరోవైపు వివిధ గ్రామాల నుంచి పట్టణాలకు వలస వచ్చి సొంత ఇండ్లు ని ర్మించుకొని స్థిరపడే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నది. మహబూబ్‌నగర్ నుంచి భూత్పూ ర్.., మహబూబ్‌నగర్ నుంచి జడ్చర్ల వరకు ఎటు చూసినా నిర్మాణాలే కనిపిస్తున్నాయి. జడ్చర్ల మా ర్గంలో మెడికల్ కళాశాల, భూత్పూర్ మార్గంలో క లెక్టరేట్ రావడంతో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకున్నది. రైతుబంధు కారణంగా భూములకు సైతం విలువ పెరిగింది. ప్రాజెక్టులతో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం లాభసాటిగా మారింది. దీంతో అన్నదాతలు తమ పిల్లల చదువుల కోసం మహబూబ్‌నగర్, గద్వాల వంటి పట్టణాలకు వచ్చి స్థిరపడుతున్నారు. పట్టణంలో సొంతిల్లు ఉండాలనే ఆ లోచనలు కూడా జనాల్లో పెరిగిపోయాయి. ఇక చా లా మంది తమ డబ్బును ప్లాట్ల రూపంలో పెట్టుబడిగా పెడుతున్నారు. దీంతో ఒకప్పుడు గజం రూ.3 వేల లోపు దొరికిన ప్లాట్లు ఇప్పుడు రూ.20వేల వ రకు చేరుకున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది జిల్లాల పరిధిలో రా జీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లను వేలం వేశారు. ఇం దులో హెచ్ఎండీఏ తరఫున మేడ్చల్, రంగారెడ్డి జి ల్లాల్లో ప్లాట్ల వేలం తర్వాత.. అత్యధిక ధర మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సారిక టౌన్ షిప్లో కావడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ధర పలికిన జిల్లాల్లో మహబూబ్‌నగర్ మూడో స్థానంలో నిలిచింది. 240 ప్లాట్లకుగానూ ప్రభుత్వానికి రూ.94.74 కోట్ల ఆదాయం సమకూరింది. రూ.50 కోట్లు వస్తుందని అంచనా వేయగా.. దాదాపుగా రెట్టింపు స్థాయిలో ఆదాయం రావడం విశేషం.
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోనూ రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు జరిగిన వేలంలో బిడ్డర్లు ఉ త్సాహంగా పాల్గొన్నారు. గద్వాల అంబర్టౌన్ షిప్లో 201 ప్లాట్లను విక్రయించి రూ.32.89 కోట్లు ఆర్జించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా, వేలంలో రూ.51.92 కోట్ల ఆదా యం వచ్చింది. గద్వాలలో గజం ప్రారంభ ధర రూ.5,500గా నిర్ణయించగా.. అత్యధికంగా గజానికి రూ.17,100 పలకడం విశేషం. అలాగే సరాసరిగా గజానికి రూ.8913 వచ్చింది. ఎంతో ఘన చరిత్ర ఉన్న గద్వాల.. జిల్లా కేంద్రం కావడంతో మ రింత ప్రత్యేకత సంతరించుకుంటున్నది. అటు రా యిచూరు, ఇటు కర్నూలు పట్టణాలకు సరిహద్దుగా ఉండే గద్వాలకు ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా మంజూరు చేయడంతో మరింత క్రేజ్ వచ్చింది. గద్వాల పట్టణం నుంచి కృష్ణా నదీ అగ్రహారం మార్గంలో ఉన్న విశాలమైన రోడ్డు పక్కనే అంబర్ టౌన్ షిప్ ఉండడంతో బిడ్డర్లు ఎగబడ్డారు. ఎలాంటి చీకూ చింత లేని క్లియర్ టైటి ల్ ఉన్న ప్లాట్లు కావడం వల్లే భారీగా డిమాండ్ వ చ్చింది. ఇప్పటికే జూరాల కుడి కాలువను దాటి నదీ అగ్రహారం మార్గంలో ఇండ్ల నిర్మాణాలు ఊపందుకోవడంతో కూడా రాజీవ్ స్వగృహ ప్లాట్లకు డిమాండ్ పెరిగింది.