న్యూఢిల్లీ: బాలీవుడ్ ఫిల్మ్ 12th ఫెయిల్ మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా ఈ ఫిల్మ్‌ను తీశారు. విక్రాంత్ మాసే, మేధా శంకర్ నటించిన ఆ చిత్రం .. సివిల్స్ రాసే అభ్యర్థుల్ని విశేషంగా ఆకట్టుకున్నది. అయితే ఆ ఫిల్మ్ స్టోరీకి కారణమైన రియల్ లైఫ్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ ఫోటోను పోస్టు చేశారు. పెళ్లి అయిన తొలి రోజులకు సంబంధించిన ఫోటో తనకు కనిపించినట్లు దానికి ట్యాగ్ ఇచ్చారు. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ శర్మ.. ఐఆర్ఎస్ శ్రద్ధా జోషిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ పోస్టు చేసిన ఫోటో వైరల్ అయ్యింది. గంటలోనే లక్షన్నర వ్యూవ్స్ వచ్చాయి. చంబల్ లోయకు చెందిన మనోజ్ ఉన్నత చదువులను క్లియర్ చేసి.. చివరకు ఎలా ఐపీఎస్ అయ్యారన్న కోణంలో చిత్రాన్ని తెరకెక్కించారు. దీంట్లో లవ్ స్టోరీని కూడా జోడించారు.
शादी के कुछ दिन बाद का एक फ़ोटो मिला आज
….🙏 pic.twitter.com/kPqSsbcWt9— Manoj Sharma (@ManojSharmaIPS) January 10, 2024