ముంబై: రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచేసింది ఆర్బీఐ. ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలను ఇవాళ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే వడ్డీలను రెపో రేటుగా పిలుస్తారు. రెపో రేటు పెంచడం అంటే, ఇక కమర్షియల్ బ్యాంకులు, లేదా వ్యక్తులకు రుణాలు తీసుకోవడం భారంగా మారుతుంది. 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో.. రెపో రేటు 5.4 శాతానికి చేరినట్లు శక్తికాంత్‌దాస్ వెల్లడించారు. రెపో రేటును పెంచడం వరుసగా ఇది మూడవసారి. అయితే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.