దుబాయ్: ఇండియన్ టీమ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫిబ్రవరి నెలకుగాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అద్భుతంగా రాణించడంతో అశ్విన్‌ను ఈ అవార్డు వరించింది. సిరీస్‌లో మొత్తంలో 32 వికెట్లు తీసిన అశ్విన్.. చెన్నైలో జరిగిన రెండో టెస్ట్‌లో సెంచరీ కూడా చేశాడు. ఇండియా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు క్వాలిఫై అవడంలో అశ్విన్ కీలకపాత్ర పోషించినట్లు ఐసీసీ తన ట్వీట్లో తెలిపింది. ఒక సిరీస్‌లో 30కిపైగా వికెట్లు రెండోసారి తీసిన ఏకైక ఇండియన్ బౌలర్‌గా అశ్విన్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది నుంచే ఐసీసీ ఈ కొత్త అవార్డును ప్రవేశపెట్టింది. జనవరి నెలకుగాను టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో అద్భుతంగా రాణించిన పంత్.. ఈ అవార్డు తొలి విన్నర్‌గా నిలిచాడు.
24 wickets in February 📈
— ICC (@ICC) March 9, 2021
A match-defining hundred vs England 💥
ICC Men's Player of the Month ✅
Congratulations, @ashwinravi99! pic.twitter.com/FXFYyzirzK