జడ్చర్లటౌన్, జూలై 29 : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్లో అరుదైన పుట్టగొడుగును గుర్తించినట్టు గార్డెన్ సమన్వయకర్త డాక్టర్ సదాశివయ్య బుధవారం తెలిపారు. జీవవైవిధ్య పరిశోధనల్లో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త మనోహరాచారి సహకారంతో అగారికేసి జాతికి చెందిన ఈ పుట్టగొడుగును క్లార్కిఇండా ట్రా కోడెస్గా నిర్ధారించినట్టు పేర్కొన్నారు.
15 సెంటీమీటర్ల ఎత్తు, 15 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఈ పుట్టగొడుగు జింక చర్మాన్ని పోలిన గోధుమ రంగు పొలుసులతో కనిపిస్తుందని చెప్పారు. ఇప్పటివరకు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో మాత్ర మే కనిపించినట్టు తెలిపారు. దీనిని తింటే కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటా యని, కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉన్నదని తెలిపారు.