Crime news : నేరం చేసి జైలుకు వెళ్లిన అతడి బుద్ధి మారలేదు. జైలు నుంచి తప్పించుకుని వచ్చి మళ్లీ అలాంటి నేరమే చేశాడు. 2023లో నిందితుడు ఓ అరేళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్యకు పాల్పడ్డాడు. ఆ కేసులో జైలుకి వెళ్లిన అతడు పోలీసుల కళ్లగప్పి తప్పించుకున్నాడు. తాజాగా ఓ ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్యకు పాల్పడ్డాడు. మహారాష్ట్ర (Maharatra) లోని థానే జిల్లా (Thane district) లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. థానే జిల్లాలో నేతపని చేసే ఓ వ్యక్తి రెండేళ్ల క్రితం అంటే 2023లో ఓ అరేళ్ల బాలికను తన గదిలోకి పలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆమెను హత్యచేసి, మృతదేహాన్ని గోనెసంచిలో మూటగట్టి, ఇంటికి తాళం వేసి పారిపోయాడు. ఆ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మరంగా గాలించి నిందితుడిని అరెస్ట్ చేశారు.
అనంతరం కోర్టు ఆదేశాల మేరకు అతడిని రిమాండ్ ఖైదీగా థానే సెంట్రల్ జైల్లో వేశారు. అయితే ఈ ఏడాది ఆగస్టులో అతడిని కోర్టుకు తీసుకెళ్తుండగా పోలీసుల కన్నుగప్పి పారిపోయాడు. బివాండిలో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. అక్కడ కూడా గతంలో మాదిరిగానే పక్కింట్లో ఉండే ఏడేళ్ల బాలికను ఇంట్లోకి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు.
అనంతరం హత్యచేసి ఇంటికి తాళం వేసి పారిపోయాడు. బాలిక పేరెంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అతడు అద్దెకు ఉన్న గది తలుపులు పగులగొట్టి చూడగా మృతదేహం లభించింది. సీసీ కెమెరాలను ఆధారంగా రైల్వే స్టేషన్లో నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడు బీహార్లోఇ మధుబనికి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు చెప్పారు.