సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్టీసీ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. రూ.100 విలువైన ట్రావ్ యూజ్ యూ లైక్ టికెట్ ధరలో రూ.20 తగ్గించింది. రూ.80తోనే ఈనెల 14 వరకు జంటనగరాల్లో 24 గంటల పాటు ప్రయాణించవచ్చు.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో ఇంజిన్ గ్రోత్లా ఉండే హైదరాబాద్ మహా నగరం వివిధ అంశాల్లోనూ ముందంజలోనే ఉంది. తలసరి ఆదాయం మొదలు పారిశ్రామికాభివృద్ధి, రహదారుల విస్తీర్ణం ఇలా అన్ని కేటగిరీల్లోనూ గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలు తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన ‘తెలంగాణ సామాజిక-ఆర్థిక అవుట్‌లుక్-2020’ నివేదికలో ఇలాంటి ఆసక్తికర అంశాలు అనేకం ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి..