అబ్దుల్లాపూర్‌మెట్, మార్చి 13 : మూడు రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్న వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి వీరభద్రస్వామి కల్యాణం కనుల పండువగా జరిగింది. జడ్పీటీసీ దాస్‌గౌడ్, వైస్ ఎంపీపీ కొలన్ శ్రీధర్‌రెడ్డి, పరిసర గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు హాజరై పూజలు నిర్వహించారు. సర్పంచ్ బుర్ర వీరస్వామిగౌడ్, ఆలయ కమిటీ నిర్వాహకులు స్వామి వారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఉప్పు సురేశ్, వార్డు సభ్యులు బాలమణి, నేతికండ్ల భద్రప్ప, ఉప్పు రజనీకాంత్, బాత్కుల శ్యామల, పోచమ్మ, యాదయ్య, నిర్మల, నాయకులు జ్ఞానేశ్వర్, వెంకటేశ్, ఐలయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు.
ఘనంగా శివపార్వతుల కల్యాణం
కేశంపేట : మండల కేంద్రంలోని శివాలయంలో శివపార్వతుల కల్యాణాన్ని ఆదివారం భక్తులు ఘనంగా జరిపించారు. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను గ్రామంలో ఊరేగింపు అనంతరం దేవాలయానికి తీసుకువచ్చారు. అనంతరం దేవతామూర్తులకు గ్రామానికి చెందిన మఠం చంద్రశేఖర్-చందన దంపతులు పట్టు వస్ర్తాలను సమర్పించారు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ యాదయ్యచారి, మాజీ ఎంపీపీ విశ్వనాథం, పూజారులు గంగాధరయ్య, విరుపాక్షయ్య, శివకుమార్, చిన్నయ్య, గ్రామస్తులు మఠం చంద్రశేఖర్, మల్లికార్జున్, పశుపతినాథ్ పాల్గొన్నారు.
భైర్ఖాన్పల్లిలో ఘనంగా రథోత్సవం
కేశంపేట మండలం భైర్ఖాన్పల్లి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉత్సవాల నిర్వాహకులు, భక్తులు ఘనంగా రథోత్సవాన్ని నిర్వహించారు. దేవాలయం నుంచి రథంపై దేవతల ఉత్సవ విగ్రహాలను గ్రామంలోని వీధులగుండా భజనలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం రథాన్ని దేవాలయానికి తరలించారు. సాయంత్రం గ్రామ రైతులు, వ్యాపారులు ఎడ్లబండ్లు, వాహనాలను దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. కార్యక్రమాల్లో సర్పంచ్ కృష్ణయ్య, మాజీ సర్పంచ్‌లు యాదగిరిరావు, రాఘవేందర్రావు, రూప్లానాయక్, గ్రామస్తులు యాదగిరియాదవ్, బాబుయాదవ్, ద్రోణాచారి, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.