పరిగి, మార్చి 9 : వికారాబాద్ జిల్లా పరిధిలో భారీగా తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, 22 మంది సీనియర్ అసిస్టెంట్లు, గిర్దావర్ల బదిలీలు జరిగాయి. ఈ మేరకు తహసీల్దార్లు, ఇతర ఉద్యోగులను బదిలీ చేస్తూ బుధవారం జిల్లా కలెక్టర్ నిఖిల ఉత్తర్వులు జారీ చేశారు. కొడంగల్ తహసీల్దార్ ఎస్.రవీందర్ నవాబుపేట్ తహసీల్దార్‌గా, అక్కడ పనిచేస్తున్న తహసీల్దార్ బుచ్చయ్య కొడంగల్ తహసీల్దార్‌గా, బొంరాస్‌పేట్ తహసీల్దార్ షాహెదాబేగం దోమ తహసీల్దార్‌గా, అక్కడ పనిచేస్తున్న తహసీల్దార్ వాహెదా ఖాతూన్ బొంరాస్‌పేట్ తహసీల్దార్‌గా, మర్పల్లి తహసీల్దార్ వి.తులసీరాంను దౌల్తాబాద్ తహసీల్దార్‌గా, పెద్దేముల్ నాయబ్ తహసీల్దార్ మోహన్‌ను మర్పల్లి నాయబ్ తహసీల్దార్‌గా, మర్పల్లి నాయబ్ తహసీల్దార్ వెంకటాచారిని బంట్వారం తహసీల్దార్ కార్యాలయంలో నాయబ్ తహసీల్దార్‌గా బదిలీ చేసి, జిల్లా కలెక్టరేట్లో డిప్యుటేషన్‌పై నియమించారు.
కులకచర్ల నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్‌రావు జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయానికి బదిలీ అయ్యారు. నాయబ్ తహసీల్దార్ సురేశ్‌ను కొడంగల్ మండల నాయబ్ తహసీల్దార్‌గా బదిలీ చేశారు. కొడంగల్ నాయబ్ తహసీల్దార్ బి.శ్రీనివాసులు తాండూరు ఆర్డీవో కార్యాలయానికి బదిలీ అయ్యారు. నాయబ్ తహసీల్దార్ కిరణ్‌కుమార్ పెద్దేముల్ మండల నాయబ్ తహసీల్దార్‌గా బదిలీ అయ్యారు. నవాబుపేట్ నాయబ్ తహసీల్దార్ రమేశ్ కులకచర్ల నాయబ్ తహసీల్దార్‌గా బదిలీ అవ్వగా, మోమిన్‌పేట్ తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డిని బంట్వారం తహసీల్దార్‌గా నియమించారు. నవాబుపేట్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ సుదర్శన్‌ను పెద్దేముల్ తహసీల్దార్ కార్యాలయంలో గిర్దావర్‌గా నియమించి వికారాబాద్ ఆర్డీవో కార్యాలయంలో డిప్యుటేషన్‌పై నియమించారు. పెద్దేముల్ గిర్దావర్ ఓంకార్ వికారాబాద్ ఆర్డీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా నియమింపబడ్డారు.
వికారాబాద్ ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ భాగ్యలక్ష్మిని బషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో గిర్దావర్‌గా నియమించారు. వికారాబాద్ కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రజిత నవాబుపేట్ తహసీల్దార్ కార్యాలయంలో గిర్దావర్‌గా, నవాబుపేట్ తహసీల్దార్ కార్యాలయంలో గిర్దావర్‌గా పనిచేస్తున్న ఖాజమియా తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో గిర్దావర్‌గా, వికారాబాద్ కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎస్.శివప్రసాద్ దోమ తహసీల్దార్ కార్యాలయంలో గిర్దావర్‌గా, ధారూర్ తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దశరథ్‌సింగ్ మర్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో గిర్దావర్‌గా, మర్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో గిర్దావర్‌గా పనిచేస్తున్న కరుణాకర్‌ను వికారాబాద్ కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్‌గా, పెద్దేముల్ తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎం.నవీన ధారూర్ తహసీల్దార్ కార్యాలయంలో గిర్దావర్‌గా, ధారూర్ తహసీల్దార్ కార్యాలయంలో గిర్దావర్‌గా పనిచేస్తున్న డి.
సుప్రియ మోమిన్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో గిర్దావర్‌గా, మోమిన్‌పేట్ మండల తహసీల్దార్ కార్యాలయంలో గిర్దావర్‌గా పనిచేస్తున్న వి.అరుణ్‌కుమార్ వికారాబాద్ కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్‌గా, వికారాబాద్ కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎల్.నరేశ్‌కుమార్ వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో గిర్దావర్‌గా, వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో గిర్దావర్‌గా పనిచేస్తున్న వి.మోహన్ వికారాబాద్ ఆర్డీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా, వికారాబాద్ కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎస్.వివేకానంద్రావు పూడూరు తహసీల్దార్ కార్యాలయంలో గిర్దావర్‌గా, పూడూరు తహసీల్దార్ కార్యాలయంలో గిర్దావర్‌గా పనిచేస్తున్న బాల్‌రాజ్ తాండూరు ఆర్డీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా, తాండూరు ఆర్డీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బి.రాకేశ్ ఆర్డీవో కార్యాలయంలో గిర్దావర్‌గా, వికారాబాద్ కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎన్.రమేశ్ కోట్‌పల్లి తహసీల్దార్ కార్యాలయంలో గిర్దావర్‌గా, కోట్‌పల్లి తహసీల్దార్ కార్యాలయంలో గిర్దావర్‌గా పనిచేస్తున్న ఎస్.రాంరెడ్డి వికారాబాద్ కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్‌గా, వికారాబాద్ కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సుశీల్సాయికుమార్ నవాబుపేట్ తహసీల్దార్ కార్యాలయంలో గిర్దావర్‌గా, కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బి.వీరేశం కులకచర్ల తహసీల్దార్ కార్యాలయంలో గిర్దావర్‌గా, కోట్‌పల్లి తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మాధవరెడ్డి మర్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో గిర్దావర్‌గా, మర్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో గిర్దావర్‌గా పనిచేస్తున్న ఎం.బాలమహేశ్వర్ కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్‌గా, పరిగి తహసీల్దార్ కార్యాలయంలో గిర్దావర్‌గా పనిచేస్తున్న డి.నరేందర్ కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్‌గా నియమింపబడ్డారు.