రంగారెడ్డి, మార్చి 27, (నమస్తే తెలంగాణ): మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభు త్వం చర్యలు చేపట్టింది. సంఘాల వారీగా కా కుండా వ్యక్తిగతంగా కూడా మహిళలు ఆర్థిక ప్రగతి సాధించేందుకు వడ్డీలేని రుణాలతోపాటు స్వల్ప వడ్డీతో కూడిన రుణాలను మంజూరు చేస్తున్నది. మహిళా సంఘాల సభ్యులు ఆ రుణాలతో ఎక్కువగా కిరాణా షాపులు, గేదెలు, గొ ర్రెల కొనుగోలుతోపాటు కూరగాయల వ్యాపా రం చేస్తున్నారు. కాగా జిల్లాలోని మహిళా సం ఘాల సభ్యులకు మంజూరు చేసే వడ్డీ లేని రు ణాల లక్ష్యాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం పెంచాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు నిర్ణయించారు. అంతేకాకుండా రుణాలను సక్రమం గా చెల్లిస్తూ తిరిగి పొందుతున్న సంఘాల సభ్యులను ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నారు. అయితే జిల్లాలో 99శాతం స్వయం సహాయక సంఘాల సభ్యులు రుణాలను పొంది సక్రమంగా చెల్లిస్తుండగా.. 408 ఎస్‌హెచ్‌జీలు మాత్రమే రెగ్యులర్‌గా చెల్లించడంలేదని డీఆర్డీఏ అధికారులు గుర్తించారు. అయితే ఒక్కొక్క స్వయం సహాయ క సంఘానికి రూ.5 నుంచి రూ.10లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు చేయూతనందిస్తున్నారు.
లక్ష్యం రూ.900 కోట్లు..
స్వయం సహాయక సంఘాల సభ్యులకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ఏడాదికి మించి రుణాలను మంజూరు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ మంజూరు చేసే మొత్తం ఈ ఏడాదితో పోలిస్తే రూ.300 కోట్లకుపైగానే ఉండనున్నది. ఎస్‌హెచ్‌జీలకు మంజూరు చేసే బ్యాంకు లింకేజీ రుణాలతోపాటు స్త్రీనిధి రుణాలకు సం బంధించి రూ.900 కోట్ల రుణాలను మంజూరు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే బ్యాంకు లింకేజీ ద్వారా రూ.800 కోట్ల రుణాలు, స్త్రీనిధి కింద రూ.100 కోట్ల రుణాల ను మంజూరు చేయాలని నిర్ణయించారు. అయి తే ఈసారి కొత్త మహిళా సంఘాల ఏర్పాటుతోపాటు ఎస్‌హెచ్‌జీ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వచ్చే ఏడాది కోసం భారీగా రుణాల లక్ష్యాన్ని పెంచింది. అ యితే ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లింకేజీ కింద రూ.562 కోట్లు, స్త్రీనిధి పథకం కింద రూ.100 కోట్లను లక్ష్యంగా అధికారులు నిర్ణయించగా, ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యానికి మించి రుణాలను మంజూరు చేసింది. అదేవిధంగా నూతనంగా ఏర్పాటైన మహిళా సంఘాలకు వాటి కార్యకలాపాల నిర్వహణకు తొలుత రూ.60వేల గ్రాంటును జాతీయ జీవనోపాధి పథకం కింద మంజూరు చేసిన ప్రభు త్వం, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎస్‌హెచ్‌జీల పనితీరును బట్టి ప్రతి ఏడాది రుణ పరిమితిని పెంచనున్నది. అయితే రంగారెడ్డి జిల్లాలో 19,157 స్వయం సహాయక సంఘాలుండగా అందులో 2,17,417 మంది సభ్యులున్నారు, వీరిలో 2,752 స్వయం సహాయక సంఘాలు కొత్తగా ఏర్పాటుకాగా అందులో 29,450 మం ది సభ్యులున్నారు.
రూ. 582 కోట్ల రుణాల మంజూరు
2021-22కు సంబంధించి బ్యాంకు లింకేజీతోపాటు స్త్రీనిధి పథకం కింద రూ.562 కోట్ల రుణాలను మహిళా సంఘాల సభ్యులకు మంజూరు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా దానికి మించి రూ.582( 103.64 శాతం మేర) కోట్ల రుణాలను జిల్లాలోని 12,114 స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేశారు. బ్యాంకు లింకేజీ కింద ఒక్క మహేశ్వరం మం డలం మినహాయిస్తే మిగతా అన్ని మండలాల్లో వంద శాతానికి మించి రుణాలను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మంజూరు చేశారు.
మండలాల వారీగా రుణాలు ఇలా..
శంకర్పల్లి మండలం లో రూ.19.18 కోట్లు, నందిగామలో రూ. 16.90 కోట్లు, మాడ్గులలో రూ.38.18 కోట్లు, మంచాలలో రూ.31.12 కోట్లు, మొయినాబాద్‌లో రూ.38.53 కోట్లు, చౌదరిగూడెంలో రూ.11.12 కోట్లు, కొత్తూరులో రూ. 12.16 కోట్లు, శంషాబాద్‌లో రూ.36.17 కోట్లు, కందుకూరులో రూ.37.80 కోట్లు, షాబాద్‌లో రూ.25.13 కోట్లు, ఇబ్రహీంపట్నం లో రూ.31.88 కోట్లు, కడ్తాల్‌లో రూ.24.84 కోట్లు, ఆమనగల్లులో రూ.10.99 కోట్లు, యాచారంలో రూ.31.18 కోట్లు, చేవెళ్లలో రూ. 36.04 కోట్లు, ఫరూఖ్‌నగర్‌లో రూ.40.13 కోట్లు, తలకొండపల్లిలో రూ.25.48 కోట్లు, అబ్దుల్లాపూర్‌మెట్‌లో రూ.29.61 కోట్లు, కేశంపేటలో రూ.32.42 కోట్లు, కొందుర్గులో రూ. 15.11 కోట్లు, మహేశ్వరం మండలంలో 38.48 కోట్లుగా ఉన్నాయి.
సక్రమంగా చెల్లించని సంఘాలు..408
జిల్లాలో సక్రమంగా రుణాలను చెల్లించని స్వయం సహాయక సంఘాలు 408 ఉన్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు గు ర్తించారు. అత్యధికంగా షాబాద్ మండలం లో 102 సంఘాలుండగా, కందుకూరు మండలంలో 50, యాచారం, మొయినాబాద్ మండలాల్లో 41 సంఘాలు రుణాల ను తిరిగి చెల్లించడంలో మొండికేసినట్లు అధికారులు తెలిపారు. ఆ సంఘాల్లో రూ.2.98 కోట్ల బకాయిలు ఉన్నట్లు తేల్చారు. అత్యధికంగా షాబాద్ మండలంలో రూ.1.07 కో ట్లు కాగా, కందుకూరు మండలంలో రూ. 52.82 లక్షల బకాయిలు ఉన్నాయి.
ఎస్‌హెచ్‌జీల బలోపేతమే లక్ష్యం
జిల్లాలోని స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలోని ప్రతి సంఘానికి లక్ష్యానికి మించి రుణాలను మంజూరు చేసే లా చర్యలు తీసుకుంటున్నాం. మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేలా అవసరమైన తోడ్పాటును అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించాం.
– అమయ్‌కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్