Athletic Competition | ఎల్బీనగర్, ఫిబ్రవరి 7( నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 11న ఉదయం7 గంటలకు 14 ఏండ్లు పైబడిన వారికి జూనియర్ అండ్ సీనియర్ విభాగాలలో రన్స్,జంప్స్, త్రోస్ నిర్వహించనున్నారు. ఈ విభాగాల్లో గెలిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు సంఘం కార్యదర్శి గోపి తెలిపారు. పూర్తి వివరాలకు రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ కోచ్ సాయి రెడ్డిని ఫోన్ నంబర్లు 9703838987,9502210045లో సంప్రదించగలరని సూచించారు.
Hockey Championship
జిల్లాస్థాయి హాకీ పోటీల్లో హైమావతి విద్యార్థుల సత్తా
గోల్నాక ,ఫిబ్రవరి 7: హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హాకీ పోటీల్లో అంబర్పేట డివిజన్ హైమావతి విద్యార్థులు సత్తా చాటారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా డీఈవో రోహిణి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.అండర్ 14 హాకీ విభాగంలో ప్రేమ్ నగర్ హైమావతి పాఠశాల బాలికలు మొదటి స్థానంలో నిలవగా.. బాలురు రెండో స్థానం సాధించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ శ్రీదేవి, పాఠశాల ప్రిన్సిపల్ ఆవుల నిరంజన్ పాల్గొని విజేతలను అభినందించారు.