కేంద్ర ప్రభుత్వం రైతు పండించిన వరి ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మహా ధర్నా కార్యక్రమానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పెద్దఎత్తున తరలివెళ్లారు.
కులకచర్ల మండలం నుంచి పార్టీ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి ఆధ్వర్యంలో రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు పీరంపల్లి రాజు, నాయకులు మాలె కృష్ణయ్యగౌడ్, నాగని బిచ్చయ్య పాల్గొన్నారు.
కొందుర్గు, జిల్లెడ్ చౌదరిగూడ మండలాల నుంచి కొందుర్గు వైస్ ఎంపీపీ రాజేశ్‌పటేల్ ఆధ్వర్యంలో మండలాల అధ్యక్షులు హఫీజ్, శ్రీధర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులున్నారు.
మొయినాబాద్ మండలం నుంచి ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, మండల అధ్యక్షుడు డి.మహేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు.
తాండూరు మండలం నుంచి సీనియర్ నాయకుడు పురుషోత్తంరావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు ఉత్సాహంగా తరలివెళ్లారు.
షాద్‌నగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే కిష్టయ్య ఆధ్వర్యంలో షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, మాజీ చైర్మన్ విశ్వం, నాయకులు రాంబల్‌నాయక్, మన్నె నారాయణ, దేవేందర్‌యాదవ్, వెంకట్రాంరెడ్డి, జమృత్‌ఖాన్, శేఖర్, లక్ష్మణ్‌నాయక్, ఎంకే సలీం, సత్యనారాయణ, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, పీఏసీఎస్ చైర్మర్లు, డైరెక్టర్లు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, టీఆర్ఎస్ ప్రధాన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తలకొండపల్లి మండలం నుంచి మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, నాయకులు శ్రీశైలం, భాస్కర్‌రెడ్డి, హరిమోహన్‌రెడ్డి, స్వామిగౌడ్, లక్ష్మీకాంత్, జంగయ్య, కార్యకర్తలు, రైతులు వెళ్లారు.
శంకర్పల్లి మండలం నుంచి ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బద్దం శశిధర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల, మున్సిపల్ అధ్యక్షులు కె.గోపాల్, వి.వాసుదేవ్‌కన్నా, సీనియర్ నాయకుడు కె.వెంకటేశ్, మిర్జాగూడ అధ్యక్షుడు ఒగ్గు ఆంజనేయులు, వార్డు సభ్యుడు ప్రవీణ్‌కుమార్, నాయకులు, రైతులు తరలివెళ్లారు.
బంట్వారం మండలం నుంచి మండల అధ్యక్షుడు రాములుయాదవ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు ఖాజాపాషా, నాయకులు అంజిలయ్య, శ్రీనివాస్, రాజు, మల్లేశం తదితరులు సుమారు 40 మంది వరకు తరలివెళ్లారు.
కేశంపేట మండలంలోని 29 గ్రామాల నుంచి ఎంపీపీ రవీందర్‌యాదవ్ ఆధ్వర్యంలో జడ్పీటీసీ తాండ్ర విశాల, మండల అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
యాచారం మండలం నుంచి జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, పీఏసీఎస్ చైర్మన్ తోటిరెడ్డి రాజేందర్‌రెడ్డి, డైరెక్టర్ మద్దెల శశికళ, నాయకులు చిన్నోళ్ల యాదయ్య, మల్కాపురం శివశంకర్ పాల్గొన్నారు
కోట్‌పల్లి మండలం నుంచి టీఆర్ఎస్ శ్రేణులు రాములు, రాంచందర్, కృష్ణ, మహేందర్, మోసిన్ వెళ్లారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సారథ్యంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతు బంధు సమితి సభ్యులు, రైతులు వెళ్లారు.
యాలాల మండలం నుంచి టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తంరావు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కృష్ణకుమార్, నాయకులు రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు.
కొత్తూరు మండలం నుంచి జడ్పీటీసీ శ్రీలత, ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, కొత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, మండల అధ్యక్షుడు కృష్ణయ్య, మాజీ అధ్యక్షుడు యాదగిరి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులున్నారు.