రంగారెడ్డి, నవంబర్ 18, (నమస్తే తెలంగాణ): జిల్లాలోని మద్యం షాపు ల టెండర్లు దక్కించుకునేందుకు గురువారం వ్యాపారులు అధిక సం ఖ్యలో పోటీపడ్డారు. ఒకట్రెండు షా పులు మినహా మిగతా అన్ని మద్యం షాపులకు పోటాపోటీగా దరఖాస్తులొచ్చాయి. గురువారంతో మద్యం షా పుల దరఖాస్తుల స్వీకరణకు ఆఖరి రోజు కావడంతో ఉదయం నుంచే మ ద్యం వ్యాపారులు అధిక సంఖ్యలో తరలివచ్చి జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులకు దరఖాస్తులను అందజేశారు. అయితే మద్యం షాపులను దక్కించుకునేందుకు వ్యాపారులు భారీగా దరఖాస్తులు చేశారు. గతంలో మాదిరిగా ఒకరు ఒక దరఖాస్తు మాత్రమే చేయాలనే నియమం లేకపోవడంతో వ్యాపారులు ఒక్కొక్కరు 5-10 వరకు దరఖాస్తులు చేసుకున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. మరోవైపు మద్యం టెండర్లను దక్కించుకునేందుకు మహిళలు కూడా అధిక సంఖ్యలో పోటీపడ్డారు. జిల్లాలోని సరూర్‌నగర్ డివిజన్ పరిధిలో అధిక మొత్తంలో దరఖాస్తులు రావడం గమనార్హం. అయితే ఒక్కొ దరఖాస్తుకు రూ.2 లక్షల చొ ప్పున డీడీల రూపంలో వ్యాపారులు చెల్లించగా, జిల్లాలోని 234 మద్యం షాపులకు వచ్చిన దరఖాస్తులతో జిల్లా ఎక్సైజ్ శాఖకు రూ.140 కోట్ల ఆదాయం వచ్చింది.
ఆఖరి రోజు నాలుగు వేలకుపైగా దరఖాస్తులు..
దరఖాస్తుల స్వీకరణ గడువు గురువారం సాయంత్రం 5 గంటల వరకు ఉండటంతో గురువారం ఉదయం నుంచి రా త్రి వరకు జిల్లా ఎక్సైజ్ కార్యాలయం మద్యం వ్యాపారులతో కిటకిటలాడింది. ఉదయం 10నుంచి రాత్రి 7 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. క్యూలో అధిక మొత్తంలో దరఖాస్తుదారులు ఉండటంతో రాత్రి 10 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా 234 మద్యం షాపులకుగాను దాదాపుగా 7 వేల దరఖాస్తులు రాగా, గురువారం ఒక్కరోజే 4 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. సరూర్‌నగర్ డివిజన్‌లోనే నాలుగు వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే సరూర్‌నగర్‌లో 134 మద్యం షాపులు, శంషాబాద్ డివిజన్లో 100 మద్యం దుకాణాలు ఉన్నాయి.
రేపు డ్రా..షాపుల కేటాయింపు
రేపు డ్రా తీసి మద్యం షాపులను కేటాయించనున్నారు. సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో 20వ తేదీన ఉద యం 11 గంటలకు డ్రా కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆయా ఎక్సైజ్ పోలీస్స్టేషన్ల వారీగా ఒక్కొ మద్యం షాపునకు వచ్చిన దరఖాస్తులను బట్టి డ్రా తీసి ఎవరికి దుకాణం దక్కిం దో అధికారులు వెల్లడించనున్నారు. అయితే ప్రభుత్వం మద్యం షాపుల్లో రిజర్వేషన్లు ప్రకటించిన దృష్ట్యా ఎస్సీలకు-17 మద్యం షాపులు, ఎస్టీలకు రెండు, గౌడ కులస్తులకు 34 మద్యం షాపులను రిజర్వేషన్లలో భాగంగా కేటాయించనున్నారు.
వికారాబాద్ జిల్లాలో 837 దరఖాస్తులు
పరిగి, నవంబర్ 18: వికారాబాద్ జిల్లా పరిధిలో 59 మద్యం షాపులకోసం 837 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ గడువు గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గురువారం ఒక్కరోజే 464 దరఖాస్తులు రావడం గమనార్హం. జిల్లా పరిధిలోని 5 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో 59 మద్యం షాపులుండగా వాటిలో ఎస్సీలకు-9షాపులు, గౌడ్లకు-6, ఎస్టీలకు-2 షాపులు రిజర్వు చేయబడ్డాయి. ఇదిలావుండగా గత రెండేళ్ల క్రితం కంటే ఈసారి అత్యధికంగా మద్యం షాపులకోసం దరఖాస్తు లు అందాయి. అప్పట్లో 46 షాపులకు 684 దరఖాస్తులొచ్చాయి.
దరఖాస్తుల ద్వారా రూ.16.74కోట్ల ఆదాయం..
జిల్లా పరిధిలోని 59 మద్యం షాపులకు మొత్తం 837 దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షలు చొప్ప న చలానా లేదా డీడీ తీయడం జరిగింది. ఈ లెక్కన దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.16.74కోట్ల ఆదాయం చేకూరింది. ఇదిలావుండగా ఈనెల 20వ తేదీ ఉదయం 11 గంటలకు వికారాబాద్‌లోని అంబేద్కర్ భవన్లో అధికారులు డ్రా తీస్తారు.