కోట్‌పల్లి, నవంబర్ 17: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ‘మీతో నేను’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని రాంపూర్ గ్రామంలో ‘మీతో నేను’ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ అనితా గోపాల్‌రెడ్డి, అధికారులతో కలిసి పర్యటించారు. ప్రజల సమస్యల ను, జరిగిన అభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో తిరి గి సమస్యలను గుర్తించారు. అనంతరం హనుమాన్ మందిర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కొంతమంది రైతులు పొలాలకు ఫార్మేషన్ రోడ్డు వేయించాలని ఎమ్మెల్యే దృష్టికి తేగా వేయి స్తామన్నారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు ముందుం టామని భరోసా ఇచ్చారు. గ్రామంలో విద్యుత్ సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు డీఈ, ఏఈలతో మాట్లాడారు. మరి కొంత మంది పెన్షన్ల గురించి అడుగగా త్వరలో వస్తాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ మండల వర్కింగ్ ప్రెసి డెంట్ రాములు, పార్టీ మండల అధ్యక్షుడు అనిల్‌కుమార్, సర్పం చు ల సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్‌యాదవ్, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.