షాబాద్, నవంబర్ 16 : ప్రభుత్వ నిధులతో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిధిలోని పెద్దవేడు గ్రామంలో జడ్పీటీసీ అవినాశ్‌రెడ్డి, ఎంపీపీ ప్రశాంతిరెడ్డితో కలిసి శుభోదయం కార్యక్రమంలో భాగంగా కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ… గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామన్నారు. తండాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతున్నదన్నారు. శుభోదయం ద్వారా నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే వివరించారు. జడ్పీటీసీ అవినాశ్‌రెడ్డి, ఎంపీపీ ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ…గ్రామాల్లో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామన్నారు. పథకాలపై గ్రామ స్థాయిల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్‌రావు, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వప్నారెడ్డి, మాజీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ శేఖర్‌రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఏండీ చాంద్‌పాషా, మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదయ్య, ఎస్సీసెల్ మండలాధ్యక్షుడు వెంకటయ్య, టీఆర్ఎస్ నాయకులు నర్సింహారెడ్డి, దర్శన్, మల్లేశ్, దేవేందర్‌రెడ్డి, అశోక్‌గౌడ్, భూపాల్‌రెడ్డి, రాజుగౌడ్, గోపాల్, రమేశ్‌యాదవ్, రాందేవ్, శ్రీధర్‌రెడ్డి, ఇనాయత్, రాంచందర్, అవిలాశ్గౌడ్, శివ ఉన్నారు.