రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలో మహిళా సబ్ ఇన్స్పెక్టర్పై ఓ ట్రక్కు దూసుకువెళ్లింది. గత రాత్రి వెహికిల్ చెకింగ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. రాంచీలోని తుపుదానా ఔట్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న ఇన్ఛార్జ్ ఎస్సై సంధ్యా తోప్నోపై నుంచి వాహనం దూసుకువెళ్లింది. వాహనంలో అక్రమంగా ఆవులను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్సై సంధ్యా చెకింగ్ కోసం వెళ్లింది. ట్రక్కును ఆపే సమయంలో దాని డ్రైవర్ ఆ ఎస్సై పైనుంచి తీసుకువెళ్లినట్లు ఎస్పీ కౌశల్ కిశోర్ తెలిపారు. హాస్పిటల్‌కు తీసుకువెళ్లే లోపు ఆమె మరణించిందని, నిందితుడిని అరెస్టు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. సోమవారం హర్యానాలో డీఎస్పీ ర్యాంక్ అధికారిని కూడా ట్రక్కుతో ఢీకొట్టి చంపిన విషయం తెలిసిందే. మైనింగ్ మాఫియా ఆ హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.