జోధ్‌పూర్: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో భారత్ మాల ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న ట్రక్కును టెంపో ట్రావెలర్ ఢీకొన్న ప్రమాదంలో 18 మంది మరణించగా, ముగ్గురు గాయపడ్డారు.
జోధ్‌పూర్‌లోని ఫలోడీ ప్రాంతానికి చెందిన కొందరు 220 కి.మీ దూరంలోని కొలాయట్ ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.