న్యూఢిల్లీ: మాల్దీవులు ధూమపానంపై నిషేధం విధించింది. 2007 జనవరి 1 తర్వాత జన్మించిన వారు పొగ త్రాగరాదని తెలిపింది. ఈ నిబంధన నవంబరు 1 నుంచి అమల్లోకి వచ్చింది. పొగాకు వినియోగంపై ఓ తరంపై నిషేధం విధించిన తొలి దేశంగా మాల్దీవులు నిలిచింది.
పర్యాటకులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ నిబంధనలను ఉల్లంఘించే రిటెయిలర్లపై సుమారు రూ.2.84 లక్షలు, వ్యక్తులపై సుమారు రూ.28,000 జరిమానా విధిస్తామని తెలిపింది.