హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): విలేజ్ రెవెన్యూ అసిసెంట్ల్ల (వీఆర్ఏ) (వారసుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీఆర్ఏ వారసుల ఉద్యోగ కల్పనే ప్రధాన ఎజెండాగా శనివారం వీఆర్ఏల కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా రాజశేఖర్, ఉపాధ్యక్షుడిగా భరత్‌కుమార్, జనరల్ సెక్రటరీగా చింత శివ, కోశాధికారిగా నర్సింలు ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. వీఆర్ఏ వారసుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని చెప్పారు. వారసులకు ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వీఆర్ఏలు చేపట్టిన సమ్మె ఫలితంగా 20,555 మంది వీఆర్ఏలకు ప్రయోజనం చేకూరిందని గుర్తుచేశారు. అందులో 3,797 మంది ఇంకా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఆ వారసులందరికీ ఉద్యోగాలు కల్పిం చడమే నూతన కమిటీ ప్రధాన లక్ష్యమని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ కార్యవర్గ సభ్యులు, వీఆర్ఏ ప్రతినిధులు పాల్గొన్నారు.