వీఆర్ఏ వారసుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజశేఖర్
విలేజ్ రెవెన్యూ అసిసెంట్ల్ల (వీఆర్ఏ) (వారసుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీఆర్ఏ వారసుల ఉద్యోగ కల్పనే ప్రధాన ఎజెండాగా శనివారం వీఆర్ఏల కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
- రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): విలేజ్ రెవెన్యూ అసిసెంట్ల్ల (వీఆర్ఏ) (వారసుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీఆర్ఏ వారసుల ఉద్యోగ కల్పనే ప్రధాన ఎజెండాగా శనివారం వీఆర్ఏల కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా రాజశేఖర్, ఉపాధ్యక్షుడిగా భరత్‌కుమార్, జనరల్ సెక్రటరీగా చింత శివ, కోశాధికారిగా నర్సింలు ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. వీఆర్ఏ వారసుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని చెప్పారు. వారసులకు ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వీఆర్ఏలు చేపట్టిన సమ్మె ఫలితంగా 20,555 మంది వీఆర్ఏలకు ప్రయోజనం చేకూరిందని గుర్తుచేశారు. అందులో 3,797 మంది ఇంకా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఆ వారసులందరికీ ఉద్యోగాలు కల్పిం చడమే నూతన కమిటీ ప్రధాన లక్ష్యమని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ కార్యవర్గ సభ్యులు, వీఆర్ఏ ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

