Rajahmundry Rosemilk Teaser | మనం ఇప్పటికే ఎన్నో ప్రేమకథలు చూసుంటాం. అయినా సరే మళ్ళీ లవ్‌స్టోరీ కాన్సెప్ట్‌తో సినిమా వస్తుందంటే ఆసక్తితో ఎదురు చూస్తుంటాం. కథలు ఒకేలా ఉన్నా కథనం కొత్తగా ఉంటే ఇట్టే కనెక్ట్ అయిపోతాం. మరి ముఖ్యంగా కాలేజ్ లవ్‌స్టోరీ అంటే ఇంకా ఎక్కువగా కనెక్ట్ అయిపోతాం. అలాంటి కాలేజ్ లవ్‌స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘రాజమండ్రి రోజ్ మిల్క్’. జై జాస్తి, అనంతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి నాని బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలే నెలకొల్పాయి. తాజాగా చిత్ర బృందంఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసింది.
లేటెస్ట్గా రిలీజైన టీజర్ ఆధ్యంతం ఆకట్టుకుంటుంది. కాలేజ్ డేస్‌లో ఫ్రెండ్స్‌తో గడిపిన మధుర జ్ఞాపకాలు, ఫస్ట్ లవ్, ప్రేమ చెప్పడానికి పడిన పాట్లు అన్ని ఎమోషన్స్‌ను టీజర్లో చూపించారు. టీజర్‌ను చూస్తుంటే మన కాలేజ్ డేస్ గుర్తుకువస్తున్నాయి. నేపథ్య సంగీతం ఫ్రెష్ ఫీల్‌ను కలిగిస్తుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, ఇంట్రూప్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ’96’ ఫేం గోవింద్ వసంత్ సంగీతం అందిస్తున్నాడు. ఈయనతో పాటుగా అజయ్ అరసాడ, యశ్వంత్ నాగ్, భరత్-సౌరభ్‌లు స్వరాలు సమకూరుస్తున్నారు. వెన్నెల కిషోర్ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి ప్రణీత్ ప్రట్టిపాటీ కథను అందించాడు.