హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) : ద్రోణి ప్రభావంతో వచ్చే మూడ్రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జోగుళాంబ గద్వాల, మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో 43 డిగ్రీలలోపు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. పలు జిల్లాల్లో మోస్తరు వర్షా లు కురిసినట్టు వెల్లడించింది.