Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Rahul Gandhi | ఓట్ల దొంగతనం (Vote Theft) లో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్‌కుమార్ (Gyanesh Kumar) ప్రధాన నేరస్థుడు కాదని లోక్‌సభ (Lok Sabha) లో కాంగ్రెస్‌పక్ష నాయకుడు, ఎంపీ రాహుల్‌గాంధీ (Rahul Gandhi) అన్నారు. ఇప్పుడు సీఈసీ రాజీనామా చేసి అప్రూవర్‌గా మారాలని కోరారు.
Rahul Gandhi : ఓట్ల దొంగతనం (Vote Theft) లో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్‌కుమార్ (Gyanesh Kumar) ప్రధాన నేరస్థుడు కాదని లోక్‌సభ (Lok Sabha) లో కాంగ్రెస్‌పక్ష నాయకుడు, ఎంపీ రాహుల్‌గాంధీ (Rahul Gandhi) అన్నారు. ఇప్పుడు సీఈసీ రాజీనామా చేసి అప్రూవర్‌గా మారాలని కోరారు. సీఈసీ వెనుక ఉండి ఈ పని చేయించిన అసలు నేరస్థులను బయటపట్టడం కోసం తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అప్రూవర్‌గా మారితే ప్రతిపక్షాలు సీఈసీని క్షమించే అవకాశం కూడా ఉందని రాహుల్‌గాంధీ అన్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతాయని, భారీగా భద్రతా బలగాలను మోహరించడం, నిరసనకారులపై అణచివేత చర్యలు చేపట్టడం ద్వారా ప్రభుత్వం సీఈసీని కాపాడటానికి ఎలా ప్రయత్నిస్తుందో స్పష్టమవుతోందని అన్నారు. సీఈసీకి మీరు ఇచ్చే సలహా ఏమిటని మీడియా అడుగగా.. ‘మీరు అప్రూవర్‌గా మారిపోండి. మీరు ఒక నేరం చేశారు. కానీ నిజాయితీగా చెప్పాలంటే మీరు ప్రధాన నేరస్తులు కాదు. మీరు ఒక తప్పు చేశారు నిజమే. కానీ ఆ తప్పు వెనుక ఉన్న సూత్రధారులు మీరు కాదు. మీరు చేసిన పనికి కారణమైన వారి కోసమే మేం ప్రయత్నిస్తున్నాం’ అని సీఈసీని ఉద్దేశించి రాహుల్‌గాంధీ అన్నారు.
ఇంకా మాట్లాడుతూ.. ‘మీకు ఇది చాలా సులభం. రాజీనామా చేసి తప్పుకోండి అంతే చాలు. ఎలాంటి సమస్యా ఉండదు. అలా చేస్తే బహుశా మేము మిమ్మల్ని క్షమించవచ్చు కూడా. ఎందుకంటే అది దేశానికి, రాజ్యాంగానికి చేసే సేవ అవుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, శ్రీ అదానీల ఒత్తిడి వల్లనే మీరు అలా చేశారని మాకు తెలుసు’ అన్నారు. సీఈసీ ఎదుర్కొంటున్న ఒత్తిడి ఎలాంటిదో తమకు అర్థమైందని చెప్పారు.
తాము క్షమించే గుణం ఉన్నవాళ్లమని, క్రూరులం కాదని రాహుల్‌గాంధీ అన్నారు. కానీ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పారు. ఓట్ల దొంగతనంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు ప్రతిపక్షాల ర్యాలీకి ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

