Justice For Angel Chakma | ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో త్రిపురకు చెందిన ఎంబీఏ విద్యార్థి ఎంజెల్ చక్మ కిరాతక హత్యపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన దేశంలో పెరుగుతున్న విద్వేషానికి, జాత్యహంకారానికి పరాకాష్ట అని ఆయన సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. జాత్యహంకారం (Racism) అనేది నాగరిక సమాజానికి పట్టిన అంటువ్యాధి అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు.
అసలు ఏం జరిగిందంటే.!
త్రిపురకు చెందిన ఎంజెల్ చక్మ మరియు అతని సోదరుడు మైఖేల్ డెహ్రాడూన్‌లో ఉన్న సమయంలో, కొందరు దుండగులు వారి రూపంపై జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తూ (మీరు ఇండియన్స్ కాదంటూ) అవమానించారు. దీనిపై ప్రతిఘటించినందుకు గాను వారిపై కత్తులు, రాడ్లతో కిరాతకంగా దాడి చేశారు. “మేము భారతీయులమే.. మా జాతీయతను నిరూపించుకోవడానికి ఇంకేం సర్టిఫికేట్లు చూపాలి?” అని ఎంజెల్ ప్రశ్నించడం ఆ అమానుష దాడికి ముందు అతను చేసిన ఆఖరి నిరసన. ఈ దాడి అనంతరం ఎంజెల్ తీవ్ర గాయాలతో దాదాపు 16 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ఆసుపత్రిలో కన్నుమూశాడు. అయితే ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
వైవిధ్యంలో ఏకత్వం కలిగిన భారతదేశం ఇలాంటి ఎంపిక చేసిన విద్వేషాలను భరించలేదని, ఇటువంటి విష సంస్కృతి దేశ మనుగడకే ప్రమాదమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జాత్యహంకారం ఏ రూపంలో ఉన్నా దానిపై కఠిన విధానాలు పాటించాలని, బాధితుడికి న్యాయం జరగడం విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదని ఆయన డిమాండ్ చేశారు. కేవలం ఖండనలతో సరిపెట్టకుండా, జాత్యహంకార వ్యాఖ్యలు మరియు హింసకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం స్పష్టమైన, కఠినమైన చట్టాలను తీసుకురావాలని కేటీఆర్ కోరారు. ఇలాంటి ఘటనలు విడిగా జరిగేవి కావని, సమాజంలో ద్వేషం సాధారణీకరించబడుతుందనడానికి(Normalise) ఇది ఒక హెచ్చరిక అని కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఒక బీఎస్ఎఫ్ జవాను కుమారుడైన ఎంజెల్ చక్మ ఇలా జాత్యహంకారానికి బలికావడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్‌తో పాటు పలువురు జాతీయ నేతలు ఈ ఘటనను ఖండించారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.
Racism Is a Crime Against Humanity
The brutal killing of Angel Chakma an MBA student from Tripura in Dehradun remains a painful reminder of how prejudice, power, and impunity can converge with devastating consequences
India cannot afford this poison. A nation built on unity in… pic.twitter.com/tZgcHtN8xw
— KTR (@KTRBRS) December 31, 2025