ఫైనల్ జడ్జిమెంట్ డైరెక్టర్‌దే అయినా.. ఆ అవుట్‌పుట్‌ను కెమెరాలో బంధించి మనకందించేది మాత్రం ఛాయాగ్రాహకుడే. అందుకే వాళ్లను DOP(డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ) అంటారు గౌరవంగా. రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమాకు రత్నవేల్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. రీసెంట్గా ఆ సినిమా గురించి రత్నవేల్ చెప్పిన విశేషాలు ‘పెద్ది’పై అంచనాల్ని ఆకాశంలో నిలబెట్టేలా ఉన్నాయి. ‘ ‘పెద్ది’ అందరూ అనుకుంటున్నట్టు సామాన్యమైన కమర్షియల్ సినిమా కాదు. ఇది ఊహలకు అందని అద్భుతం. ఇందులో రామ్‌చరణ్‌లోని కొత్త యాంగిల్‌ని ఆడియన్స్ చూస్తారు. ఆయన నటన, ైస్టెల్, డిక్షన్ అన్నీ గత సినిమాలకు భిన్నంగా ఉంటాయి.
ఈ సినిమాకోసం ఆయన కొత్తగా మారిపోయారు. బుచ్చిబాబు చాలా స్ట్రాంగ్ స్క్రిప్ట్ రాసుకున్నారు. ఈ సినిమా నేను చేయడానికి కారణం ముఖ్యంగా కథే. నన్ను అంత ఎైగ్జెట్ చేసిందీ కథ. అంత కొత్తదనం కథలో ఉన్నప్పుడు నేనూ కచ్ఛితంగా కొత్తగా ట్రై చేయాలి. అందుకే కొత్తగా తీస్తున్నా. నాచురల్ లైటింగ్‌తో, ఓ కొత్త టింట్‌తో ‘పెద్ది’ సినిమా ఉంటుంది. దర్శకుడు బుచ్చిబాబు నెక్ట్స్ లెవల్లో ‘పెద్ది’ని తెరకెక్కిస్తున్నారు. ‘రంగస్థలం’ చిత్రాన్ని మించేలా ‘పెద్ది’ ఉంటుంది.’ అని తెలిపారు రత్నవేల్.