Allu Aravind | హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ను మరో విషాదం వెంటాడింది. తన తల్లి మరణం మరువక ముందే.. అల్లు అరవింద్ చిన్ననాటి స్నేహితుడు నాగరాజు కన్నుమూశాడు. నాగరాజు స్నేహితుడే కాదు.. అరవింద్‌కు అత్యంత సన్నిహితుడు కూడా. అల్లు అరవింద్‌కు సంబంధించిన గీతా ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నాగరాజు పని చేస్తున్నారు. నాగరాజు మృతి పట్ల అల్లు అరవింద్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు సంతాపం ప్రకటించారు. నాగరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
గీతా ఆర్ట్స్ నిర్మించిన మాస్టర్ సినిమా నుంచి నాగరాజు గీతా ఆర్ట్స్ నిర్మించిన ఎన్నో సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. 76 ఏండ్ల వయసు కలిగిన నాగరాజుకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు.
అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ (94) కన్నుమూసిన సంగతి తెలిసిందే. వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె ఆగస్టు 30వ తేదీన తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆ బాధ నుంచి కోలుకోక ముందే అత్యంత సన్నిహితుడు నాగరాజు మరణించడం.. అల్లు అరవింద్ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది.