మొంజా(ఇటలీ): ఇటాలియన్ ఫార్ములావన్ గ్రాండ్‌ప్రి రేసులో మాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఆదివారం హోరాహోరీగా సాగిన రేసులో రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ అగ్రస్థానంలో నిలిచాడు. గత కొన్ని రేసుల్లో నిరాశపరిచ్ని వెర్స్టాపెన్ మే నెల తర్వాత తొలిసారి టైటిల్‌తో మెరిశాడు.
ఫార్ములావన్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన టైమింగ్‌తో పోల్ పొజిషన్ దక్కించుకున్న వెర్స్టాపెన్ ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించాడు. 20 సెకన్ల ఆలస్యంతో నోరిస్(మెక్లారెన్), పియాస్ట్రి(మెక్లారెన్) వరుసగా రెండు, మూడు స్థానాలతో పోడియం ఫినిష్ చేశారు. ఇటలీ గ్రాండ్ ప్రి తర్వాత పియాస్ట్రి 324 పాయింట్లతో నంబర్‌వన్‌లో కొనసాగుతుండగా, నోరిస్(293), వెర్స్టాపెన్(230) ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నారు.