Ramana Gogula | టాలీవుడ్లో ఆల్‌టైమ్ సూపర్ హిట్ ఫేవరెట్ ఆల్బమ్స్‌ను ప్రేక్షకులకు అందించిన క్రేజీ కాంబో పవన్ కల్యాణ్-రమణ గోగుల. పవన్ కల్యాణ్ నటించిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ ప్లే లిస్ట్ ఎవరిదంటే వెంటనే చెప్పే పేరు రమణ గోగుల. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన పాటలు ఇప్పటికీ ఎప్పటికీ యూత్‌తోపాటు అందరినీ డ్యాన్స్ చేసేలా చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఓ మిస్సమ్మా మిస్సమ్మా యమ్మా, వయ్యారి భామ నీ హంస నడకా, మేడిన్ ఆంధ్రా స్టూడెంట్.. ఇలా ఒక్కటేమిటి రమణగోగుల పవన్ కల్యాణ్‌కు అందించిన అన్ని పాటలు ఎవర్ గ్రీన్ హైలెట్స్‌గా నిలుస్తాయి. చివరగా ఈ ఇద్దరి కలయికలో అన్నవరం సినిమా వచ్చింది. మళ్లీ రెండు దశాబ్ధాల తర్వాత రమణ గోగుల్-పవన్ కల్యాణ్ కలిసి పనిచేయబోతున్నారన్న వార్త ఇప్పుడు టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
రమణ గోగుల ఈ ఏడాది గోదారి గట్టు మీద రామచిలుకావే అంటూ గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడని తెలిసిందే. అయితే పవన్ కల్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్‌లో ఓ పాట పాడనున్నాడట రమణ గోగుల. ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద పాట సునామి సృష్టించడం ఖాయమైనట్టేనని ఎగిరిగంతేస్తున్నారు అభిమానులు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఓ వైపు డీఎస్పీ మ్యూజిక్, మరోవైపు రమణ గోగుల్ వాయిస్, ఇంకో వైపు పవన్ కల్యాణ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ ఇవన్నీ కలిస్తే సిల్వర్ స్క్రీన్ షేక్ అవడం గ్యారంటీ అని చెప్పొచ్చు.
Sai Pallavi | SIIMA Awards వేడుకలో పింక్ సారీలో మెరిసిన సాయిపల్లవి.. పిక్స్ వైరల్