విద్యుత్తు కొనుగోళ్లకు ఆత్రమెందుకు?
రాష్ట్ర విద్యుత్తు అవసరాలేమిటి? అందులో కొనుగోలు చేసేది ఎంత? ఆ ఖర్చును భరించేదెవరు? అనే అంశాలపై స్పష్టత లేకుండా రెడ్కో వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తు కొనుగోళ్లకు టెండర్లు పిలువడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
- ఈఆర్సీ అనుమతించక ముందే టెండర్లా?
- యూనిట్‌కు 7 పైసల ట్రేడింగ్ మార్జిన్ దేనికి?
- బ్యాటరీ విద్యుత్తు కొనుగోలు టెండర్లపై ఈఆర్సీకి సీనియర్ జర్నలిస్టు వేణుగోపాల్‌రావు అభ్యంతరాలు
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర విద్యుత్తు అవసరాలేమిటి? అందులో కొనుగోలు చేసేది ఎంత? ఆ ఖర్చును భరించేదెవరు? అనే అంశాలపై స్పష్టత లేకుండా రెడ్కో వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తు కొనుగోళ్లకు టెండర్లు పిలువడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈఆర్సీ అనుమతి ఇవ్వక ముందే ఈ టెండర్లను ఆహ్వానించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ వ్యవహారంలో మధ్యవర్తులెందుకు? యూనిట్‌కు 7 పైసల ట్రేడింగ్ మార్జిన్ దేనికన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నా యి.
రాష్ట్ర విద్యుత్తు అవసరాల కోసం 800 మెగావాట్ల విండ్ పవర్, 3,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తుకు అదనంగా 1,000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బెస్), 2,000 మెగావాట్ల రౌండ్ ది క్లాక్(ఆర్టీసీ) పునరుత్పాదక విద్యుత్తు, మరో 2,000 మెగావాట్ల పీక్ ఎఫ్డీఆర్ విద్యుత్తు కొనుగోలు చేయాలని డిసమ్లు ప్రతిపాదించాయి. దీనిపై సీనియర్ జర్నలిస్టు, విద్యుత్తు రంగ నిపుణుడు వేణుగోపాల్‌రావు ఈఆర్సీకి పలు అభ్యంతరాలను సమర్పించారు. ఇం త భారీ కొనుగోళ్లకు ముందుగా రాష్ట్ర వాస్తవ విద్యుత్తు అవసరాలు, అందుబాటులో ఉన్న విద్యుత్తు, అదనపు విద్యుత్తు కొనుగోళ్ల వల్ల పడే ఆర్థిక భారం, బెస్ ప్రయోజనాలపై సమగ్ర అధ్యయనం చేయాలని ఈఆర్సీని కోరారు.
అనుమతికి ముందే టెండర్లా?
విద్యుత్తు కొనుగోళ్లకు ఈఆర్సీ అనుమతి ఇవ్వకముందే టెండర్లను ఆహ్వానించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని వేణుగోపాల్‌రావు పేర్కొన్నారు. ఈఆర్సీ అనుమతి కోసం డిస్కమ్‌లు ఎదురుచూస్తుండగానే మధ్యవర్తి సంస్థలుగా వ్యవహరిస్తున్న టీజీ రెడో, టీజీ జెన్కో టెండర్లు పిలవడం, ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి సుమారు 120 మంది బిడ్డర్లు హాజరయ్యారని, టెండర్లు పూర్తయి పీపీఏలు కుదుర్చుకున్న తర్వాత ఈఆర్సీ తప్పనిసరిగా అనుమతి ఇవ్వాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారని వివరించారు. విద్యుత్తు కొనుగోళ్లలో యూనిట్‌కు 7 పైసల చొప్పున మధ్యవర్తి సంస్థలకు ట్రేడింగ్ మార్జిన్ చెల్లించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించారు. డిసమ్లు స్వయంగా లేదా తెలంగాణ పవర్ కోఆర్డినేషన్ కమిటీ (టీజీపీసీసీ) ద్వారా టెండర్లను ఆహ్వానించడం ద్వారా పారదర్శకమైన పోటీ బిడ్డింగ్‌తో తకువ ధరకు విద్యుత్తును కొనుగోలు చేయవచ్చు కదా? అని ప్రశ్నించారు. మధ్యవర్తులకు చెల్లించే మార్జిన్ వల్ల వినియోగదారులపై అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణలోనే ప్లాంట్లు పెట్టాలి..
ఇతర రాష్ర్టాల నుంచి విద్యుత్తును కొనుగోలు చేసే విధానానికి ముగింపు పలకాలని వేణుగోపాల్‌రావు సూచించారు. బయటి రాష్ర్టాల్లోని పునరుత్పాదక విద్యుత్తు ప్లాంట్ల నుంచి విద్యుత్తు కొనుగోళ్లు చేయడం కంటే తెలంగాణలోనే వికేంద్రీకృత పద్ధతిలో కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేయాలని జెన్కోకు సూచించారు. పీక్ డిమాండ్, భూముల లభ్యతను పరిగణనలోకి తీసుకుని విద్యుత్తు వినియోగ కేంద్రాలకు సమీపంలోనే ప్లాంట్లను నెలకొల్పడం ఉత్తమమని సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

