జెన్‌జీపై కర్కషత్వం.. జెన్ఆల్ఫాతో రాజకీయం?
నిజామాబాద్ నగరంలోని మాధవనగర్ రైల్వే వంతెన నిర్మాణంలో జాప్యంపై బీజేపీ చేపట్టిన నిరసనలో విద్యార్థులు పాల్గొనేలా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ ద్వంద్వనీతి
నిజామాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ నగరంలోని మాధవనగర్ రైల్వే వంతెన నిర్మాణంలో జాప్యంపై బీజేపీ చేపట్టిన నిరసనలో విద్యార్థులు పాల్గొనేలా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దీక్షలో పాల్గొన్న విద్యార్థుల్లో అంతా 16 ఏండ్లలోపు వారే. జనరేషన్ లెక్కల ప్రకారం వీరంతా జెన్ -ఆల్ఫాగా గుర్తిస్తున్నారు. ఢిల్లీలో జెన్-జీ యువతను బీజేపీ ప్రభుత్వం లాఠీలతో కొట్టి, జైళ్లకు పంపింది. అదే బీజేపీ ఇప్పుడు నిజామాబాద్‌లో రైల్వే వంతెన కోసం పాఠశాల విద్యార్థులను నిరసనలో కూర్చోబెట్టింది. ఈ నిరసనలకు బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డితో పాటు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నాయకత్వం వహించడం విశేషం.
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తే యువతను దేశ ద్రోహులుగా చిత్రీకరించి.. స్కూల్ పిల్లలతో ఇదే బీజేపీ ప్రజాప్రతినిధులే రాజకీయాలకు వాడుకోవడం ఎంత వరకు కరెక్ట్? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ 2022 మార్గదర్శకాల ప్రకారం ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికల ప్రచారం, ధర్నాలు, ర్యాలీలకు 18 ఏండ్లలోపు పిల్లలను భాగస్వామ్యం చేయరాదు. స్కూల్ పిల్లలను రాజకీయాలకు వాడుకోవడం జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015, సెక్షన్ 75 ప్రకారం నేరం అని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

