మూడేండ్లలో 9,102 అట్రాసిటీ కేసులు
తెలంగాణలో గడిచిన మూడేండ్లలో 9,102 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైతే కేవలం 32 కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షలు పడటం ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ఘోర వైఫల్యానికి నిదర్శనమని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు.
- నిందితులకు శిక్షలు పడింది 32 కేసుల్లోనే
- దళితులపై పెరిగిన దాడులు.. సర్కార్ జాడ్యం
- ప్రత్యేక డ్రైవ్‌తో పెండింగ్ కేసులు తేల్చాల్సిందే
- డీజీపీకి ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల వినతి
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో గడిచిన మూడేండ్లలో 9,102 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైతే కేవలం 32 కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షలు పడటం ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ఘోర వైఫల్యానికి నిదర్శనమని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. దళితులు, గిరిజనులపై రోజురోజుకూ పెరుగుతున్న దాడులను అరికట్టాలని కోరు తూ మంగళవారం ఆయన మేడే రాజీవ్‌సాగర్, రాంబల్ నాయక్, సాల్మన్రాజ్తో కలిసి డీజీపీకి వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఎర్రోళ్ల మాట్లాడుతూ అక్టోబర్ 1న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారమే గడిచిన మూడేండ్లలో 159 మంది ఎస్సీలు, 54 మంది ఎస్టీలు కలిపి మొత్తం 213 మంది హత్యకు గురయ్యారని, 1,305 మంది బాలికలు, మహిళలపై లైంగిక దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తంచేశారు. కేసులు నమోదు చేయడంలో, దర్యాప్తు నిర్వహణలో, సాక్ష్యాధారాల సేకరణలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారని, దీనివల్లే కన్విక్షన్ రేట్ దారుణంగా పడిపోయిందని, పరిహారం అందక బాధితులు ఏండ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తున్నదని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న అట్రాసిటీ కేసులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, చార్జిషీట్ దాఖలుకు స్పష్టమైన గడువు విధించాలని ప్రభుత్వాన్ని కోరారు. అట్రాసిటీ ఫిర్యాదు అందిన వెంటనే అదే రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, జాప్యం చేసే స్టేషన్ హౌస్ ఆఫీసర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసుల్లో కన్విక్షన్ రేటును పెంచేందుకు సమగ్రంగా సాక్ష్యాధారాలను సేకరించడంతో పాటు ప్రత్యేక కోర్టులకు డెడికేటెడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలని కోరారు. గత ఐదు వారాల్లో జరిగిన వరుస సంఘటనలు రాష్ట్రంలో దళిత, బలహీన వర్గాల రక్షణ డొల్లతనాన్ని కండ్లకు కడుతున్నాయని ఉదాహరణలతో వివరించారు. ఆయా ఘటనలపై సమగ్ర విచారణ జరిపి, బాధితులైన దళిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

