‘బర్న్ సర్వైవర్ మిషన్’ సేవలు భేష్
ప్రమాదవశాత్తు శరీరం కాలిపోయి తీవ్ర గాయాలపాలైన, యాసిడ్ దాడికి గురై బాధపపడుతున్న నిరుపేద బాధితులకు నిహారి మండల్ అందిస్తున్న సేవలు అభినందనీయమని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు.
- ట్రస్ట్‌కు నా వంతుగా మద్దుతునిస్తా
- శరీరం కాలిన వారికి ఫ్రీగా ప్లాస్టిక్ సర్జరీ
- బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ) : ప్రమాదవశాత్తు శరీరం కాలిపోయి తీవ్ర గాయాలపాలైన, యాసిడ్ దాడికి గురై బాధపపడుతున్న నిరుపేద బాధితులకు నిహారి మండల్ అందిస్తున్న సేవలు అభినందనీయమని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను కలిసిన నిహారి.. తాను స్థాపించిన బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్ (బీఎస్ఎంఎస్) ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలు, ‘బర్న్స్ టు షైన్-2026’ లక్ష్యాలను వివరించారు.
ట్రస్ట్‌కు పూర్తి మద్దతు ఇస్తానని కే టీఆర్ హామీ ఇచ్చారు. తాను అనుభవించిన వేదనను మరెవరూ పడకూడదని 2014లో ట్రస్ట్‌ను స్థాపించిన నిహారి.. కార్పొరేట్ సంస్థల సహకా రంతో 420 ఉచిత శస్త్రచికిత్సలు చేయించారు. ‘పెగాసిస్టమ్’ సంస్థ సహకారంతో ‘బర్న్స్ టు షైన్ 2026’ చేపట్టానని, అర్హులైన బాధితులను గుర్తించి, ప్రముఖ ప్లాస్టిక్, కాస్మెటిక్ సర్జన్ కల్యా ణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అక్టోబర్ 31 వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని, 7680974918 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

