సెల్ఫ్ డిక్లరేషన్ మూర్ఖపు నిర్ణయం
‘సాగునీళ్లు ఇవ్వలేమని, పంటలు వేయొద్దని రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకొవాలన్నది ప్రభుత్వ మూర్ఖపు నిర్ణయం.. ఇలాంటి దరిద్రపు ప్రభుత్వాన్ని తన 40 ఏండ్ల ప్రజాజీవితంలో చూడనేలేదు’ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
- నా 40 ఏండ్ల ప్రజాజీవితంలో ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని చూడనేలేదు
- పాలన చేతగాకుంటే రేవంత్‌రెడ్డి తప్పుకోవాలి
- బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : ‘సాగునీళ్లు ఇవ్వలేమని, పంటలు వేయొద్దని రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకొవాలన్నది ప్రభుత్వ మూర్ఖపు నిర్ణయం.. ఇలాంటి దరిద్రపు ప్రభుత్వాన్ని తన 40 ఏండ్ల ప్రజాజీవితంలో చూడనేలేదు’ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక్క వానకాలంలో నీళ్లు లేక పంటలెండిపోయి బియ్యం ధరలు అమాంతం పెరిగాయని, ఇదే పరిస్థితి యాసంగిలోనూ ఉంటే రైతులు, రైతుకూలీలు బతికేదెలా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన నీటిమట్టం లేకపోతే నెలరోజుల్లో కాఫర్‌డ్యామ్ నిర్మించి నీటిని వినియోగించుకోవచ్చని సూచించారు. తెలంగాణ భవన్లో కార్పొరేషన్ మాజీ చైర్మన్ కే విప్లవ్కుమార్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు నీరు, విద్యుత్తును అందించడంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రాణహిత నదిలో వృథాగా దిగువకు వెళ్లిపోతున్న నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉన్నదని చెప్పారు. రోజుకు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసినా ఐదు నెలల్లో 150 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి 30 నెలలపాటు పట్టించుకోకుండా, ఇప్పుడు మహారాష్ట్రకు వెళ్లి తమ్మిడిహట్టి గురించి మాట్లాడుతున్నారని, అక్కడికి వెళ్లి సాధించిదేమిటని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

