అడ్డగోలుగా జరిమానాలా.. చిన్న కాలేజీలను దెబ్బతీయడమే ఉద్దేశమా?
ఇంటర్ బోర్డు అధికారుల తీరుపై ప్రైవేట్ జూనియర్ కాలేజీలు మరోసారి భగ్గుమన్నాయి. కాలేజీలపై విధించిన భారీ జరిమానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. లేదంటే ఇంటర్ బోర్డును ముట్టడిస్తామని హెచ్చరించాయి.
- కార్పొరేట్ కాలేజీలకు సహకరించడమే లక్ష్యమా?
- కాలేజీలన్నింటికీ అఫిలియేషన్లు అబద్ధం
- ఇంటర్బోర్డులో అవినీతిపై విచారణ చేయాలి: టీపీజేఎంఏ
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ బోర్డు అధికారుల తీరుపై ప్రైవేట్ జూనియర్ కాలేజీలు మరోసారి భగ్గుమన్నాయి. కాలేజీలపై విధించిన భారీ జరిమానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. లేదంటే ఇంటర్ బోర్డును ముట్టడిస్తామని హెచ్చరించాయి. మంగళవారం నాంపల్లిలోని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం (టీపీజేఎంఏ) కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరి సతీశ్, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, మైనారిటీ కాలేజీల ప్రతినిధి మహ్మద్ అక్రమ్ అలీ మాట్లాడారు. అన్ని కాలేజీలకు ఆఫిలియేషన్లు ఇచ్చామన్న బోర్డు అధికారుల మాటలు పూర్తిగా అవాస్తవమని గౌరి సతీశ్ ఆరోపించారు. 122 కాలేజీకు ఇంకా అనుమతులు మంజూరుచేయాల్సి ఉన్నదని చెప్పారు. ఈ విషయంలో బోర్డు అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కాలేజీలపై రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు విధించిన జరిమానాలను ఉపసంహరించుకోవాలని కోరారు.
ఇంటర్‌బోర్డును ముట్టడిస్తాం
నవంబర్ 1లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే లక్షలాది మంది విద్యార్థులతో ఇంటర్‌బోర్డును ముట్టడిస్తామని, ఆ తర్వాత జరిగే పరిణామాలను అధికారులే బాధ్యత వహించాలని గౌరి సతీశ్ హెచ్చరించారు. రక్తదాన శిబిరాన్ని నిర్వహించి తమ రక్తాన్ని తాగుతున్న ఇంటర్ బోర్డుకు బహుమతిగా పంపిస్తామని చెప్పారు. కాలేజీలపై ఏ ప్రాతిపాదికన, ఏ నిబంధనల ప్రకారం జరిమానాలు విధించారో స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో నడుస్తున్న కాలేజీల్లో తనిఖీలు చేసి, విచారణ జరుపాలని కోరారు. ఒకే ప్రాంతంలో పదుల కొద్ది కార్పొరేట్ కాలేజీలు నడుస్తున్నాయని, ఒక ప్రాంగణంలో అనుమతి పొంది మరో ప్రాంగణంలో క్లాసులు నడుపుతున్నారని, ఆయా కాలేజీలపై ఎందుకు జరిమానాలు విధించడంలేదని నిలదీశారు. ఇంటర్‌బోర్డు అధికారులు తీరు చూస్తుంటే చిన్న కాలేజీలను నిర్వీర్యం చేసేలా, కార్పొరేట్ శక్తులకు సహకరించేలా ఉన్నదని మండిపడ్డారు. విధిలేని పరిస్థితుల్లో తాము గోడు వెళ్లబోసుకుంటుంటే ఇంటర్ బోర్డు సెక్రటరీ బెదిరించడం సబబుకాదని పేర్కొన్నారు.
టీపీజేఎంఏ వాదనలు
‘జూన్ 30 తర్వాత ఎలాంటి నోటీసులివ్వకుండానే ఒక్కో కాలేజీకి లక్ష రూపాయిల జరిమానా విధించారు. 544 కాలేజీలకు జరిమానా విధించారు. ఇది సబబేనా? ఫైర్ ఎన్వోసీల వ్యవహారంలో అధికారుల తీరు పక్షపాతంగా ఉన్నది. మొదట నకిలీవన్న వాటిలో 52 కాలేజీలు సమర్పించిన ఫైర్ ఎన్వోసీలు ఒరిజినల్‌విగా తేల్చారు. మరో 24 కాలేజీలు ఒరిజినల్ ఫైర్ ఎన్వోసీలు సమర్పించాయి. అయినా ఈ కాలేజీలకు ఇంకా అనుమతులు మంజూరుచేయడంలేదు. రూ. 5 లక్షల నుం చి రూ.8 లక్షల జరిమానా విధించారు. అంటే ఈ కాలేజీల నడ్డి విరవాలన్నదే మీ ఎజెండానా? ఇదే ఎన్వోసీలతో గతంలో గుర్తింపు జారీచేసిన అధికారులపై చర్యలెందుకు తీసుకోవడంలేదు? ఈ వ్యవహారంలో సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ డీఐఈవోల పాత్రపై తేల్చాలి. ఇంటర్ బోర్డులో జరిగిన ఆర్థిక అవకతవకలపై సమగ్ర విచారణ జరుపాలి. ప్రభు త్వ బ్యాంకుల నుంచి డిపాజిట్లను ప్రైవేట్ బ్యాంకులకు మళ్లించడం, సీసీటీవీ కెమెరాల కొనుగోళ్లపై స్వతంత్ర విచారణ కమిటీ చేత విచారణ జరిపించాలి’ అని టీపీజేఎంఏ నేతలు డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

