బీమా చెల్లింపుల స్కామ్‌పై సీబీఐ, ఈడీ విచారణ జరపాలి
కార్మిక సంక్షేమ బోర్డులో భారీ బీమా చెల్లింపుల వ్యవహారంలో ఆర్థిక అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై సీబీఐ, ఈడీతో సమగ్ర దర్యాప్తు జరుపాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.
- ఐఆర్‌డీఏఐకి ఆర్ఎస్ ప్రవీణ్ లేఖ
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : కార్మిక సంక్షేమ బోర్డులో భారీ బీమా చెల్లింపుల వ్యవహారంలో ఆర్థిక అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై సీబీఐ, ఈడీతో సమగ్ర దర్యాప్తు జరుపాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్టీఎఐ)కు మంగళవారం లేఖ రాశారు.
అక్రమ లావాదేవీలపై తక్షణమే స్పందించి, ఫిర్యాదు అందిన 30 రోజుల్లోగా నిబంధనల ప్రకారం కఠిన చర్య లు తీసుకోవాలని రెగ్యులేటరీ సంస్థను డి మాండ్ చేశారు. మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ట్రయల్ బ్లేజర్ సంస్థ రిజిస్ట్రేషన్‌ను తక్షణమే తాతాలికంగా నిలిపివేయాలని, ఆ సంస్థకు ప్రభుత్వం లేదా కార్మిక సంక్షేమ బోర్డు ఎలాంటి కమీషన్లు, పారితోషికాలు చెల్లించకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
ముఖ్యంగా జూన్ 2025 నుంచి ఇప్పటివరకు చెల్లించిన ప్రతి క్లెయిమ్‌పై క్షుణ్ణంగా ఆడిట్ నిర్వహించాలని స్పష్టంచేశారు. పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో పరిషరించిన బీమా క్లెయిమ్‌లలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని, వాటిపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఇన్సూరెన్స్ యాక్ట్-1938లోని సెక్షన్-33 ప్రకారం ట్రయల్ బ్లెజర్ సంస్థపై విచారణ చేపట్టాలని, సంస్థ నియామకం, మూలధన అర్హతలు, కార్యాలయ మార్పులు, సుమారు రూ.346 కోట్ల నిధుల స్వీకరణ, నిర్వహణపై ఆడిట్ చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

