బేల : బేల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు నాణ్యమైన ( Quality healthcare ) చికిత్స అందించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ( MLA Payal Shankar) అన్నారు. బుధవారం బేల మండల కేంద్రంలోని కొత్త భవనంలోకి మార్చిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. పలు వార్డులు తిరిగి పనుల నాణ్యతను పరిశీలించారు. అనంతరం డాక్టర్ వంశీ కృష్ణ, సిబ్బందితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల నుంచి అధికంగా వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. మరికొన్ని మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని, మరి కొంత మంది సిబ్బందిని నియమించాలని డీఎంహెచ్వోను ఫోన్లో కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను పీహెచ్సీ సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఇంద్రశేఖర్, దత్త నీక్కం, గణేష్ బోన్ గిర్వార్, మురళిధర్ ఠాక్రే, పోత్ రాజ్వార్ నవీన్, రాము, తదితరులు ఉన్నారు.