వెల్దండ : గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని ( Quality Medical Service) అందుబాటులోకి తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ( MLA Kasireddy Narayana reddy) అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం బైరాపూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు అందుబాటులో ఉంచాలన్నదే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్, సింగిల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్, మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ జయప్రకాష్, జంగయ్య యాదవ్,రషీద్, పుల్లయ్య, హరికిషన్, జర్పుల శ్రీను, రాజు యాదవ్, వైద్యులు పాల్గొన్నారు.