హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): ప్రయాణికులకు చేరవయ్యేందుకు ఆర్టీసీ వినూత్న పంథాలో సాగుతున్నది. టెక్నాలజీ వినియోగాన్ని పెంచేలా బస్‌టికెట్ బుకింగ్ కౌంటర్లు, టికెట్ రిజర్వేషన్ కౌంటర్లు, పార్సిల్, కార్గో కేంద్రాల్లో యూపీఐ, క్యూ ఆర్ కోడ్ విధానంలో చెల్లింపులను ప్రోత్సహించాలని టీఎస్ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, సికింద్రాబాద్‌లోని రెతిఫైల్, జేబీఎస్‌లోని రిజర్వేషన్, పార్సిల్ కౌంటర్లలో క్యూఆర్ కోడ్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. వీటికి మంచి స్పందన వస్తుండటంతో త్వరలోనే రాష్ట్రంలోని అన్ని ప్రధాన బస్స్టేషన్లు, రిజర్వేషన్ కేంద్రాల్లో అమలుకు చర్యలు తీసుకోనున్నారు.