హైదరాబాద్, ఏప్రిల్ 11: దేశంలో అతిపెద్ద మల్టీప్లెక్స్ నిర్వహణ సంస్థ పీవీఆర్ సినిమాస్..దక్షిణాదిలో తన వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో కొత్తగా 5 స్క్రీన్ మల్లిపెక్స్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో భాగ్యనగరంలో 11 ప్రాపర్టీలలో 67 స్క్రీన్లు కలిగివున్నది. గచ్చిబౌలిలోని అత్రియమ్ మాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ ఐదు స్క్రీన్లలో మొత్తంగా 920 మంది కూర్చోవడానికి వీలుంటుంది. ఎడ్యుకేషనల్, ఐటీ, రెసిడెన్షియల్ హబ్‌గా కొనసాగుతున్న గచ్చిబౌలిలో ఈ స్కీన్లను ఏర్పాటు చేసినట్లు పీవీఆర్ జాయింట్ ఎండీ సంజీవ్ కుమార్ తెలిపారు. దక్షిణ భారతంలో సంస్థకు 300కి పైగా స్క్రీన్లను నిర్వహిస్తున్నది.