హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): లోక్‌భవన్ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న పీవీ సునీత జిల్లా ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కలెక్టర్, డీఈవో చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు.
గత ఎనిమిదేండ్లుగా ఉత్తమ బోధన చేస్తున్న ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వం, ఈ అవార్డును ప్రకటించింది. వృత్తిపై నిబద్ధత, విద్యార్థుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న సునీతకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు దక్కడంపై పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తంచేశారు.