న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: మారుతి సుజుకీ.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త బాలెనోను విడుదల చేసింది. పండుగ సీజన్ సందర్భంగా ఈ కారు ప్రారంభ ధరను రూ.6.09 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు బెంగళూరు షోరూంనకు సంబంధించినవి. లెవల్ 2అడాస్ ఈ సందర్భంగా మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి పార్థో బెనర్జీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతుండటంతో ఏటా వాహన సెగ్మెంట్ 63 లక్షల యూనిట్లకు చేరుకునే అవకాశాలున్నాయన్నారు. జీఎస్టీ 2.0 అందుబాటులోకి రావడంతో కార్ల ధరలు భారీగా తగ్గాయని, డిమాండ్ అధికమైందన్నారు.